Saturday 3 May 2014

ఓం శ్రీ రామ
హాస్యం - జీవనమ్
ఇష్ట దర్శనే ఆనంద:
ఇష్టలాభే మోద:
ఇష్ట అనుభవే ప్రమోద:
వికారాలూ, వెక్కిరింతలూ, వెకితి చేష్టలు కాదు హాస్యం
రైతన్నలు నిజాయితీతో పండించే సస్యంలాంటిది హాస్యం
మృదువుగా గిలిగింతలు పెట్టించాలి హాస్యం
అలాంటి హాస్యం సమాజానికి ఎంతో ఆరోగ్యకరం
మనిషి తనకుతాను కితకితలు పెట్టుకోలేడు
దైనందిన జీవనంలో తేలికపడడం అవసరం
(Those who carry lighter can reach higher)
పెద్దసంసారాలున్నపుడు తేలికగానున్న సంఘం
చిన్నసంసారాలతో బరువెక్కడం చూస్తున్నాం
ఏమీలేనప్పడు జనులెంతో సంతసంగా ఉన్నారు
అన్నీ ఉన్న ఈనాడు నీరసంతో నీరుగారుతున్నారు
నేడు ప్రతీచిన్నవిషయం చింతాగ్రస్తం
చింత చితితో సమానమన్నారు
మానవుడు, స్వార్ధం, దురాశ, నిస్పృహ, నిరాశలతో
 బాధలు మూటగట్టుకుని తనను తనే దహించుకుంటున్నాడు
మనలో అంతర్లీనమయిన ఆనందాన్ని పొందలేక
వేర్వేరు రూపాల్లో, రూపాయల్తో కొనుక్కోవాలని చూస్తున్నాం
ఈవేళ, కొనుక్కునేవన్నీ కల్తీయే కల్తీలెపుడూ హానికారకాలే
స్వచ్ఛమయిన నవ్వు నాపచేను పండిస్తుంది
ఆనందం మించిన చికిత్స లేదని ఈమధ్య వైద్యం కూడ ఋజువు చేస్తోంది
మనలోనున్న హాస్యన్ని సున్నితంగావెలికి తీద్దాం ! మన జీవితాలు సరిదిద్దుకుందాం !!

--సుజీవి,04.05.2014

1 comment: